: వందకోట్ల మార్కుకు చేరువవుతున్న తమిళ చిత్రం'కత్తి'
విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'కత్తి' చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. ఎన్నో అవాంతరాలను అధిగమించి ఈ నెల 22న ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటివరకు (బుధవారం వరకు) రూ.82 కోట్లు వసూలు చేసింది. ఈ వారం ముగిసేలోపు వందకోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. అదే కనుక నిజమైతే తమిళంలో ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమా కూడా ఇదే అవుతుంది. "నిస్సందేహంగా ఈ సంవత్సర తమిళ బ్లాక్ బాస్టర్ ఈ సినిమానే. తొలి వారంలోనే ఏకంగా రూ.82 కోట్లు కలెక్ట్ చేసింది. కచ్చితంగా రూ.వంద కోట్ల మార్కును చేరుకుంటుంది" అని ట్రేడ్ అనలిస్ట్ పేర్కొన్నారు.