: కార్ రేసింగ్ ఘటనలో ఎమ్మెల్యే బోండా ఉమ కుమారుడి అరెస్టు


గుంటూరు జిల్లాలో రేసింగ్ కు పాల్పడి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధిక్, అతని స్నేహితుడు జై శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన కారు రేసింగ్ లో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం సిద్ధిక్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్ధిక్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News