: మంచి వాతావరణంలో సమావేశం జరిగింది: కృష్ణా రివర్ బోర్డు
హైదరాబాదు ఎర్రమంజిల్ లోని జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్ తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, శ్రీశైలం జల వివాదంపై సమస్యను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు బోర్డు సూచించింది. త్వరలోనే తమ అభిప్రాయం చెబుతామని కూడా పేర్కొంది. నిన్నటి (బుధవారం) సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుదుత్పత్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈరోజు పూర్తిస్థాయి సమావేశం జరిగింది.