: రూ. 2.50 తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి. లీటరుకు రూ.2.50 పైసల మేర తగ్గనున్నాయి. ఈ ధర రేపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దారుణంగా తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించాలని దేశీయ కంపెనీలు భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు తరువాత వరుసగా ఆరోసారి పెట్రోల్ ధర తగ్గబోతోంది. అంతేకాక, అక్టోబరులో లీటరు పెట్రోల్ కు రూ.2 మేర తగ్గిన తరువాత మళ్లీ ఇదే నెలలో మరింత తగ్గడం విశేషం!