: పబ్లిక్ టాయిలెట్లో పేలుడు... బాలుడి మృతి


మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో ఓ పబ్లిక్ టాయిలెట్లో పేలుడు సంభవించడంతో బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. లోకమాన్య నగర్ ఏరియాలో జరిగిందీ ఘటన. సెప్టిక్ ట్యాంకులో ఉత్పత్తి అయిన వాయువులు అధిక పీడనం వద్ద బయటకు వెలువడి ఉంటాయని, అందుకే టాయిలెట్ పేలిపోయి ఉంటుందని థానే మున్సిపాలిటీ వర్గాలు పేర్కొన్నాయి. టాయిలెట్ సీటు సరిగ్గా సెప్టిక్ ట్యాంకుపైనే ఏర్పాటు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. మరణించిన బాలుడిని ఆకాశ్ సింగ్ గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి ఆకాశ్ అంకుల్ అని తెలుస్తోంది. అతడిని థానే సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకున్న వర్తక్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News