: ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులను మందలించిన కేటీఆర్


తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు సచివాలయంలోని డీ-బ్లాకులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా, పలువురు ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్నట్టు గుర్తించిన ఆయన... వారిని మందలించారు. ఇకపై ఉద్యోగులు లేట్ గా వస్తే హాఫ్ డే లీవ్ వేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా, ఉద్యోగుల వివరణ కూడా తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా, మొన్నటిదాకా... ఉద్యమమంటూ ఇష్టానుసారం విధులు నిర్వహించిన ఉద్యోగులను టైంకి ఆఫీసుకి రమ్మంటే కొంచెం కష్టమే. ఇదే మాట ఉద్యోగులు కూడా అనుకుంటున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News