: చంద్రబాబు జపాన్, సింగపూర్ పర్యటనల షెడ్యూల్ ఖరారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల షెడ్యూల్ ఖరారయింది. నవంబర్ 12, 13, 14 తేదీల్లో సింగపూర్... 24, 25, 26 తేదీల్లో జపాన్ దేశాలలో ఆయన పర్యటిస్తారు. కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నమూనా, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి తదితర అంశాలపై ఆయన అధ్యయనం చేస్తారు. ఈ అంశాలకు సంబంధించి ఆయా దేశాల్లోని పలు సంస్థలతో చర్చిస్తారు. భవన నిర్మాణాలను కూడా పరిశీలిస్తారు.