: నేడు హస్తిన వెళుతున్న టీటీడీపీ నేతలు


తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రంలోని పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీ వెళుతున్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. హస్తిన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, విద్యుత్ శాఖ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులను కలుస్తున్నట్టు చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైతులకు మద్దతు ధర, విద్యుత్ సమస్యలపై చర్చిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News