: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమయింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఏపీ సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఏపీ రాజధాని నిర్మాణం, హుదూద్ తుపాను, అంతర్ రాష్ట్ర సమస్యలు, విద్యార్థుల కౌన్సెలింగ్, నీటి సమస్య, రెండో విడత జన్మభూమి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ విధానానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.