: సిరీస్ పై అయిష్టతతో లేము: శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్
భారత్ తో జరగనున్న సిరీస్ విషయంలో తాము అయిష్టతతో లేమని శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అన్నాడు. కాకపోతే, సిరీస్ కు తాము సన్నద్ధం కాలేదనేదే తమ అభ్యంతరం అని చెప్పాడు. భారత్ ను ఢీకొనడం అంత సులువు కాదని... పూర్తి స్థాయిలో సన్నద్ధమైతేనే భారత్ ను ఢీకొనగలమని తెలిపాడు. పాక్ సిరీస్ తర్వాత తమకు రెండు నెలల విరామం దొరికిందని... పది రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిట్ నెస్ కార్యక్రమాన్ని ఆరంభించామని... ఇంతలోనే కథ మలుపు తిరిగిందని... సడన్ గా భారత పర్యటనకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. ఆటగాళ్లుగా ఇలాంటి వాటిని తాము సానుకూలంగా స్వీకరిస్తామని తెలిపాడు. సీరీస్ కు ధోనీ దూరమైనప్పటికీ... తాము తేలికగా తీసుకోమని చెప్పాడు.