: నేటి నుంచి లంక పర్యటన షురూ... వార్మప్ మ్యాచ్ నేడు


కొనసాగుతున్న సిరీస్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా తప్పుకోవడంతో... వారి స్థానంలో ఆడటానికి శ్రీలంక జట్టు ఇండియా విచ్చేసింది. ఈ రోజు నుంచి ఇండియాలో శ్రీలంక పర్యటన స్టార్ట్ కానుంది. నేడు ఇండియా-A జట్టుతో శ్రీలంక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇండియా-A జట్టుకు మనోజ్ తివారీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మనోజ్ తివారి, మనీష్ పాండే, ఉన్ముక్త్ చంద్, కేదార్ జాదవ్, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ లాంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, ఈ సిరీస్ కు పూర్తిగా సన్నద్ధం కాని శ్రీలంక... ప్రాక్టీస్ కోసం పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News