: రోడ్డు మార్గాన నేపాల్ కు మోదీ... రహదారి మరమ్మతులకు సిద్ధమైన నేపాల్ ప్రభుత్వం
వచ్చే నెల నేపాల్ లో 'సార్క్' సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావడానికి భారత ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. దీంతో, నేపాల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. మోదీ ప్రయాణించే రహదారిని ఆఘమేఘాల మీద మరమ్మతులు చేయాలని నేపాల్ పార్లమెంటరీ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మోదీ రోడ్డు మార్గంలో రావాలనుకుంటున్నట్టు తమకు సమాచారం అందిందని నేపాల్ అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన జనక్ పూర్, లుంబిని, ముక్తీనాథ్ లను మోదీ దర్శించుకోనున్నారు. నాలుగు రోజుల పాటు మోదీ నేపాల్ లో బస చేస్తారు.