: నేడు హైదరాబాద్ విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సాయంత్రం హైదరాబాద్ విచ్చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాదులోనే గడపనున్నారు. సాయంత్రం నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఆయన పలువురితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం బీఎస్ఎఫ్ విమానంలో ఆయన మధ్యప్రదేశ్ కు వెళతారు.