: టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్ లో ఇంకా ఎందుకు చేరలేదు?


రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాల ఆవరణలో నిన్న కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరైన భారీ బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ లు టీఆర్ఎస్ పార్టీ తీర్ధం తీసుకున్నారు. అయితే, వీరితో పాటు ఆ పార్టీలో చేర్సాల్సిన మరో టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ సభకు హాజరుకాలేదు. దీంతో, ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారా? లేదా? అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో మళ్లీ మొదలయ్యాయి. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇలా 'గుంపులో గోవింద'లా కాకుండా, సొంత జిల్లా కేంద్రమైన వరంగల్ లో గానీ, తన నియోజకవర్గం పరకాలలో కానీ ప్రత్యేకంగా ఓ భారీ సభను కేసీఆర్ సమక్షంలో నిర్వహించి, ఆ సభలో తన అనుచరులతో పాటు టీఆర్ఎస్ లో గ్రాండ్ గా జాయిన్ అవ్వాలని ధర్మారెడ్డి నిర్ణయించుకున్నారట. ఈ కారణంగానే, నిన్న హైదరబాద్ లో జరిగిన సభకు ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News