: జగన్ నివాసంలోనే పార్టీ కార్యాలయం... చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు
ఇప్పటిదాకా హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న వైకాపా ప్రధాన కార్యాలయం ఖాళీ అవుతోంది. లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసంలోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నివాసంలోని ఒక అంతస్తులో మీడియా విభాగం, మరో అంతస్తులో పార్టీ ముఖ్యుల సీట్లు, మరో అంతస్తులో ఇంటర్ నెట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విజయవాడకు ప్రధాన కార్యాలయాన్ని మార్చేంత వరకు లోటస్ పాండ్ నుంచే పార్టీ వ్యవహారాలు కొనసాగనున్నాయి. బెజవాడకు ఆఫీస్ షిఫ్ట్ అయిన తర్వాత... హైదరాబాద్ లో తెలంగాణ ఆఫీస్ ను మరో చోట ఏర్పాటు చేస్తారు.