: చంద్రబాబు గోబెల్స్ ను మించిపోయారు... ఉమ్మారెడ్డి ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు అని... అబద్ధాలలో ఆయన గోబెల్స్ ను మించిపోయారని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతిలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైకాపా నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే.