: జైపాల్ రెడ్డి ఇంట్లో వాచ్ మన్ అనుమానాస్పద మృతి


తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇంట్లో వాచ్ మన్ రామచంద్రయ్య గౌడ్ (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గుల మండల కేంద్రంలోని జైపాల్ రెడ్డి ఇంట్లో నెల రోజుల నుంచి రామచంద్రయ్య గౌడ్ పనిచేస్తున్నాడు. ఉదయం వాకిలి వూడ్చే మహిళ వచ్చి చూసేసరికి ఇంటి వెనుక భాగంలోని స్నానాల గది వద్ద అతను అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో మృతుడి అల్లుడు పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, రామచంద్రయ్యకు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

  • Loading...

More Telugu News