: కొణతాల సభ్యత్వాన్ని రద్దు చేసిన జగన్
వైఎస్సార్సీపీకి కొణతాల రామకృష్ణ చేసిన రాజీనామాను పార్టీ అధినేత జగన్ ఆమోదించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీలో కొణతాల సభ్యత్వాన్ని జగన్ రద్దు చేసినట్టు తెలిపారు. పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో కనుక్కోవాలని ఉదయం పార్టీ శ్రేణులను ఆదేశించిన జగన్, ఆయన అందుబాటులో లేకపోవడంతో రాజీనామాను ఆమోదించినట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రలో వైఎస్సార్సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. పార్టీకి విశాఖలో పెద్దదిక్కుగా ఉన్న కొణతాల రాజీనామాతో పార్టీ మరింత చిక్కుల్లో పడింది.