: టెన్నిస్ క్రీడను ఐపీటీఎల్ మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది: ముర్రే


ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టెన్నిస్ క్రీడను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ ను కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి, వర్థమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నాడు. నవంబర్ 28 నుంచి ఫిలిప్పీన్స్ లో ప్రారంభమయ్యే ఐపీటీఎల్ లో మనీలా మార్విక్ జట్టుకు ముర్రే ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ జట్టుతో పాటు సింగపూర్ స్లామర్స్, మైక్రోమాక్స్ ఇండియా యాక్సన్, యూఏఈ రాయల్స్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. కొత్త సంప్రదాయంతో సాగే ఐపీటీఎల్ ద్వారా టెన్నిస్ కు మంచి జరుగుతుందని ముర్రే పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News