: అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేది ఏమైనా వుంటే చెప్పండి: అమెరికాకు రష్యా బాసట


అమెరికాకు రష్యా బాసటగా నిలిచింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా ప్రయోగించిన కార్గో రాకెట్ పేలిపోయిన నేపథ్యంలో తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అత్యవసరంగా పంపించాల్సింది ఉంటే అందుకు తాము సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహహస్తం చాచింది. మరోవైపు కజికిస్థాన్ నుంచి రష్యా వ్యోమనౌకను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించింది. అలాగే మరో కార్గో రాకెట్ ను ప్రయోగించేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News