: చట్టవ్యతిరేక పనులు చేసిన జంతువులకు కూడా మరణశిక్ష పడింది!


తప్పు చేస్తే మనుషులకు శిక్షలు అమలు చేయడం మామూలే. కానీ, 15వ శతాబ్దంలో తప్పు చేస్తే జంతువులను కూడా శిక్షించేవారని పరిశోధకులు తెలిపారు. ఫ్రాన్స్ లో జంతువులను కూడా మనుషుల్లానే భావించేవారు. నేరం చేసిన జంతువులను బంధించి విచారించి శిక్ష విధించి అమలు చేసేవారు. ఫ్రాన్స్ లోని సావిగ్నీ అనే గ్రామంలో ఆరు వరాహాలు (పందులు) ఓ ఐదేళ్ల బాలుడిపై దాడిచేసి అతని మృతికి కారణమయ్యాయి. దీంతో భద్రతా సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. నేరం నిర్థారణ కావడంతో వాటికి మరణశిక్ష విధించారు. దీంతో వాటికి శిక్షను అమలు చేశారు. వరాహాలే కాదు, కుక్కలు, గుర్రాలు వంటి జంతువులు హద్దులు మీరితే శిక్షలు అమలు చేసేవారట. ఇలాంటి శిక్షలు మధ్యయుగాల కాలంలో ఐరోపాలో పలు మార్లు చోటుచేసుకున్నట్టు చరిత్రకారులు తెలిపారు.

  • Loading...

More Telugu News