: ఎమ్మెల్యే, మేయర్ వర్గీయుల బాహాబాహీ


నెల్లూరులో ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. నెల్లూరు పట్టణంలోని 54వ డివిజన్ లోని వెంకటేశ్వరపురంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ, తను జగన్ పేరిట గెలిచి విధేయుడిగా పని చేస్తున్నానని, కొందరు మాత్రం వైఎస్సార్సీపీ తరపున పదవులు పొంది పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. దీంతో మేయర్ వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీనికి ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుతగిలారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. పరిస్థితి శృతి మించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. జరిగిన దానిని చెప్పానే తప్ప తాను ఎవరినీ విమర్శించలేదని ఎమ్మెల్యే అన్నారు. తాను గొడవ పడేందుకు రాలేదని, అలా అనుకుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News