: నవంబర్ 12 న దేశంలోని బ్యాంకులు పనిచేయవు
నవంబర్ 12న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చాయి. వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ బ్యాంకుల సంఘంతో 13 సార్లు చర్చించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సేవల స్తంభనకు నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకుల యూనియన్లు తెలిపాయి. వేతన సవరణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ప్రాంతాల వారిగా రిలే సమ్మెలు చేయనున్నట్టు బ్యాంకుల యూనియన్లు వెల్లడించాయి. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే అప్పుడు నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలిపారు. 2012 నవంబర్ లో చేయాల్సిన వేతన సవరణ ఇంకా చేయకపోవడంపై బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమ్మెలో సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గోనున్నారని వారు తెలిపారు.