: కృష్ణా బోర్డు భేటీలో ఏపీ, తెలంగాణల మధ్య కుదరని ఏకాభిప్రాయం
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో శ్రీశైలం నీటి విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. నవంబర్ నెల 3వరకు విద్యుదుత్పత్తకి మూడు టీఎంసీల నీరు వాడుకోవాలని కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు ఒప్పుకోని తెలంగాణ అధికారులు పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో, సమస్య ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఎర్రమంజిల్ లోని జలసౌథలో ఈ మధ్యాహ్నం రెండు గంటల తరువాత మొదలైన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు జరిగింది.