: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల


తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న తొలి బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5న ఉదయం పదకొండు గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవనున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తరువాత 7,8,9 తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. నెల రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News