: 'రాజ్యసభ టికెట్' పాత మిత్రులను కలిపిందా?
పాత మిత్రులు అమర్ సింగ్, ములాయం సింగ్ యాదవ్ కలుసుకున్నారు. ఢిల్లీలోని ములాయం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. సంవత్సరాల కిందట విడిపోయిన వారిద్దరూ తాజాగా కలుసుకుని మాట్లాడుకోవడం పలు ఊహాగానాలకు దారి తీసింది. ఈ క్రమంలో త్వరలో వీరిద్దరూ ఒకటయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. త్వరలో పదిమంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అందులో అమర్ సింగ్ కూడా ఉన్నారు. వచ్చే నెల 20న ఈ ఖాళీ అయ్యే స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, ఎస్పీ తరపున రాజ్యసభకు అమర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.