: ఖమ్మం కోర్టుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ: అడ్డుకున్న న్యాయవాదులు
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బుధవారం ఓ కేసుకు సంబంధించి ఖమ్మం కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను అడ్డుకునేందుకు ఖమ్మం న్యాయవాదులు యత్నించారు. దీంతో, అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాధాకృష్ణను అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులతో ఆంధ్రజ్యోతి సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. సకాలంలో స్పందించిన పోలీసులు ఇరువర్గాలను దూరంగా పంపించివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఓ వార్తతో తన పరువుకు రాధాకృష్ణ భంగం కలిగించారంటూ ఖమ్మం రూరల్ మండలానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి ఖమ్మం కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీంతో, కోర్టు రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ బుధవారం కోర్టుకు హాజరయ్యారు.