: నల్లధనం విషయంలో ప్రభుత్వం విఫలమైతే ఉద్యమం మొదలవుతుంది: అన్నా హజారే
నల్లధనం దాచుకున్న వ్యక్తుల జాబితాను సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించడంపై సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజరే స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇప్పటికి 150 రోజులు గడిచిపోయాయి. కానీ, ఇంతవరకు నిర్దిష్టంగా ఏదీ జరగలేదు" అన్నారు. కాగా, ఇంతవరకు ఎనిమిది మంది ఖాతాదారుల పేర్లనే ప్రభుత్వం బయటపెట్టింది. మరి, మిగతా పేర్లు ఎప్పుడు వెల్లడిస్తారా? అని దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తోందని హజారే పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం గనుక విఫలమైతే దేశంలో మళ్లీ తారస్థాయిలో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.