: రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు: వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బుధవారం తిరుపతిలో జరిగిన ఆ పార్టీ చిత్తూరు జిల్లా శాఖ సమీక్షలో భాగంగా పార్టీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు ఆరోపించారు. చంద్రబాబు పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరు సాగిస్తుందని వారు వెల్లడించారు. చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా నవంబర్ 5న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామన్నారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News