: ఢిల్లీ గవర్నర్ బీజేపీ ఏజెంట్: అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ నేతలతో తెరచాటు రాజకీయాలు చేస్తూ, నజీబ్ జంగ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారని కేజ్రీవాల్ బుధవారం తన ట్విట్టర్ పేజీలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు జంగ్ చేసిందేమీ లేదని కూడా ఆయన విమర్శించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన గవర్నర్ కు సూచించారు. ఢిల్లీలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.