: సినిమా కోసం సెకండ్ హ్యాండ్ దుస్తులు ధరించిన అమీర్ ఖాన్


బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే, ప్రతి సినిమాలోనూ అమీర్ విలక్షణంగా కనిపిస్తాడు. తాజా చిత్రం 'పీకే'లోనూ అమీర్ మార్కు వైవిధ్యం కనిపిస్తోంది. పోస్టర్లు, టీజర్ ఆ విషయాన్ని చాటుతున్నాయి. అయితే, 'పీకే' పాత్రధారి చిరిగిపోయిన, పాతబడిన దుస్తులు వేసుకోవాలి. ఇందుకోసం, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ ఏం చేశారో చూడండి. రాజస్థాన్ లో షూటింగ్ జరిపిన ప్రదేశాల్లో స్థానికులిచ్చిన పాత దుస్తులనే హీరో పాత్రతో ధరింపజేశారు. ముదురు రంగుల్లో, బొమ్మలతో కూడిన ఆ దుస్తుల్లో అమీర్ ఖాన్ అందరిలోనూ ఆసక్తి కలిగించడం తెలిసిందే. కాగా, రాజస్థానీలు ఇచ్చే పాత దుస్తులకు బదులు కొత్తవి గానీ, డబ్బులు గానీ ఇస్తామని చిత్ర బృందం తెలిపిందట. దీనికి స్థానికులు పెద్ద ఎత్తున స్పందించి, రకరకాల దుస్తులు తెచ్చి హిరానీ, అమీర్ ఖాన్ ల ముందు పరిచారట.

  • Loading...

More Telugu News