: ఆత్మ పరిశీలన చేసుకోండి: జూడాలకు హైకోర్టు సూచన


సమ్మెతో సర్కారీ ఆస్పత్రుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర హైకోర్టు సూచించింది. అసలు ఏ నిబంధన కింద సమ్మెకు దిగారో చెప్పాలంటూ కోర్టు జూడాలను సూటిగా ప్రశ్నించింది. తక్షణమే సమ్మె విరమించాలన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిన జూడాలు తమ నిరసనను కొనసాగిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఈ అంశంపై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు జూడాలకు పలు ప్రశ్నలు సంధించింది. రోగుల పట్ల ఏమాత్రం దయ లేకుండా వ్యవహరిస్తున్నారని కూడా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల మంది వైద్య విద్యార్థులు సమ్మె చేస్తున్నారని జూడాల తరపు న్యాయవాది తెలిపిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News