: మహారాష్ట్ర కొత్త సీఎం మోడలింగ్ కూడా చేశారు!


మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్ గతంలో మోడలింగ్ కూడా చేశారండోయ్. నాగ్ పూర్లోని ఓ గార్మెంట్ షాపు ప్రచారం కోసం ఆయన మోడల్ అవతారమెత్తారు. 2006లో ఫడ్నవిస్ బాల్య స్నేహితుడు, ఫొటోగ్రాఫర్ వివేక్ రణడే ఈ మేరకు ఫోటో షూట్ నిర్వహించారు. పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులను ధరించి ఫడ్నవిస్ ఈ షూట్ లో పాల్గొన్నారట. నాగ్ పూర్ లో వాటికి సంబంధించిన ఐదు భారీ హోర్డింగులను ఏర్పాటు చేశామని, ఈ ప్రచారం బాగా విజయవంతమైందని రణడే తెలిపారు. ఆ హోర్డింగులను నెలకు పైగా ఉంచామని, అప్పుడు ఫడ్నవిస్ రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News