: నల్లధనం వివరాలున్న కవర్ ను సిట్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మాత్రమే తెరుస్తారు: సుప్రీంకోర్టు
దేశ విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ లో మొత్తం 627 మంది పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాను స్వీకరించిన సుప్రీంకోర్టు తర్వాత జరగబోయే కార్యాచరణను స్పష్టం చేసింది. సీల్డ్ కవర్ ను తాము ఓపెన్ చేయమని... ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మాత్రమే కవర్ ఓపెన్ చేస్తారని వెల్లడించింది.