: ఐఎస్ఎస్ కు సరుకులు తీసుకెళుతున్న నాసా కార్గో రాకెట్ పేలిపోయింది!


ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు సరుకులు, పరిశోధన సరంజామా తీసుకువెళుతున్న 'అంటారెస్' మానవ రహిత రాకెట్ నింగికెగిసిన కొన్ని సెకన్లకే పేలిపోయింది. దీంట్లో 5055 పౌన్ల వస్తుసామగ్రి ఉంది. సిగ్నస్ కార్గోషిప్ తో కూడిన 14 అంతస్తుల అంటారెస్ రాకెట్ ను తూర్పు వర్జీనియాలో నాసాకు చెందిన వాలోప్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం సాయంత్రం 6.22కి ప్రయోగించారు. అయితే, సెకన్ల వ్యవధిలో ఆకాశంలో పెద్ద వెలుగు కనిపించింది. రాకెట్ తొలి దశలో లోపం కారణంగానే విస్ఫోటనం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని రాకెట్ తయారీదారు ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎల్ కల్బర్టన్ జూనియర్ తెలిపారు.

  • Loading...

More Telugu News