: కృష్ణా నదీ జలాల బోర్డు సమావేశం వాయిదా
కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. మంగళవారం బోర్డు సమావేశానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భేటీని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. సమావేశానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత భేటీని నిర్వహిస్తామన్న బోర్డు, భేటీ ఎప్పుడు జరుగుతుందన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ ల మధ్య వర్కింగ్ గ్రూప్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఈఎన్ సీలతో పాటు ఇతర చీఫ్ ఇంజినీర్లు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లు తమతమ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.