: నవంబర్ 30 నాటికి 220 మందిపై సుప్రీంకు పురోగతి నివేదిక సమర్పించనున్న సిట్
మోదీ సర్కార్ అనుకున్నంత పనీ చేసింది. నల్లకుబేరుల భరతం పడతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మోదీ... తన మాటను నిలుపుకున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టుకు ఏకంగా 627 మంది నల్ల కుబేరుల జాబితాను కేంద్రం అందజేసింది. ఈ క్రమంలో, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు... మరింత వేగంగా దర్యాప్తు చేసే అవకాశం లభించింది. నవంబర్ (వచ్చే నెల) 30నాటికి, తొలి విడతలో 220 మంది ఖాతాదారులకు సంబంధించిన పురోగతి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. అయితే, ఈ 220 మంది ఎవరనే విషయం మాత్రం ముందే తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. 2015 మార్చి 31కి మొత్తం దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ ను ఆదేశించింది.