: సీఎం ఒకచోట... భార్య మరొక చోట!
మహారాష్ట్ర సీఎంగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవిస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కావడంతో ముంబయిలోనే ఉండాల్సిన పరిస్థితి! అయితే, ఫడ్నవిస్ అర్థాంగి అమృత ఉద్యోగరీత్యా నాగ్ పూర్ లో ఉంటున్నారు. ఆమె యాక్సిస్ బ్యాంకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్. దీంతో, ఆమె ముంబయికి బదిలీ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పైగా, వారి కుమార్తె ఐదేళ్ళ దివిజ నాగ్ పూర్లోనే యూకేజీ చదువుతోంది. ఇప్పుడా చిన్నారికి కూడా స్కూల్ చేంజ్ తప్పేట్టులేదు.