: కర్నూలులో దొంగనోట్ల ముఠా అరెస్ట్


రాయలసీమ ముఖద్వారం కర్నూలు దొంగనోట్ల చెలామణికి అడ్డాగా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో జిల్లాలో దొంగనోట్ల చెలామణి ఘటనలు వెలుగు చూశాయి. తాగాజా బుధవారం తెల్లవారుజామున దొంగనోట్లను చెలామణి చేస్తున్న ఓ ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ ముఠా పోలీసులకు చిక్కింది. విచారణలో భాగంగా ముఠా సభ్యులు వెల్లడించిన వివరాలు పోలీసులను నివ్వెరపరిచాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ దొంగనోట్లను చెలామణి చేస్తున్నామని ఒప్పుకున్న ముఠా సభ్యుల నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News