: వైకాపాను వీడను... జగన్ ప్రజాస్వామ్య పద్ధతిని పాటించాలి: మేకపాటి


వైకాపాను వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పార్టీకి రాజీనామా చేయాల్సిన స్థితి తలెత్తితే... ఎంపీ పదవి నుంచి కూడా తప్పుకుంటానని చెప్పారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమమైన 'జన్మభూమి-మా ఊరు'లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో, వైకాపా అధినేత జగన్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వేడిని పుట్టిస్తున్నాయి. ఏకంగా, జగన్ కే సూచన చేయడం వెనుకున్న అంతరార్థం ఏమిటని ఆ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ప్రధాని మోడీ మంచి పనులు చేస్తున్నారన్న మేకపాటి... బీజేపీలో చేరుతారనే వార్తలను మాత్రం కొట్టి పారేశారు. మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైకాపా నేతలు కొందరు కలిశారన్న వార్తల నేపథ్యంలో, మేకపాటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లా వైకాపాలో విభేదాలున్నాయనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు.

  • Loading...

More Telugu News