: నిలిచిపోయిన నారాయణాద్రి ఎక్స్ ప్రెస్
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్-చర్లపల్లి మధ్య సాంకేతిక లోపంతో నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. దీంతో, రైల్లోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. రైల్వే అధికారులు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ ఘటనతో పలు రైళ్లు, గూడ్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.