: కర్ణాటకలో ముదిరిన వివాదం... ఏకంగా 2800 మంది డాక్టర్ల రాజీనామా


కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2800 మంది ప్రభుత్వ వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కానీ, విధులకు హాజరవుతూ, ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళ్తే, తమ సమస్యల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ... నెల రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని నెల కిందట కర్ణాటక వైద్యాధికారుల సంఘం (కేజీఎంఓఏ) అల్టిమేటం ఇచ్చింది. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలిక రాలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన డాక్టర్లు భారీ సంఖ్యలో రాజీనామా చేశారు. తమ నిర్ణయంతో, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే... వైద్య సేవలు కొనసాగించాలని నిర్ణయించామని వైద్యుల సంఘం తెలిపింది.

  • Loading...

More Telugu News