: ఆర్థిక ఉగ్రవాది జగన్ కు మనుగడ లేకుండా చేయండి: నారా లోకేష్
వైకాపా అధినేత జగన్ కు రాజకీయ భవితవ్యం లేకుండా చేయాలని టీడీపీ యువనేత లోకేష్ అన్నారు. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ కు మనుగడ లేకుండా చేయడానికి... టీడీపీ విద్యార్థి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. విద్యార్థి సమాఖ్య కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 24 గంటలపాటు కరెంట్ ఇస్తామని చంద్రబాబు అంటే జగన్ ఎద్దేవా చేశారని... ఇప్పుడు దాన్ని చేసి చూపించామని అన్నారు. టీడీపీ మంచి పాలన అందిస్తుండటంతో జగన్ కు ఏమి చేయాలో తోచడం లేదని చెప్పారు.