: మోదీగారూ! ఆ యాభై వేల మంది ఎవరు?: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్
ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో దాదాపు 50 వేల మంది నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారని అన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆ యాభై వేల మంది ఎవరో దేశానికి తెలియాలి కనుక, నల్ల కుబేరుల లిస్టు మోదీ బయపెట్టాలని డిమాండ్ చేశారు. నల్లధనం వెలికితీతపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మోదీ నెరవేర్చాలని ఆయన సూచించారు.