: కేజ్రీవాల్! క్షమాపణలు చెప్పు... లేదంటే 5 కోట్లకు పరువునష్టం వేస్తాం!: బీజేపీ


ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. విమర్శలు, ఆరోపణలతో కేజ్రీవాల్ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో అతని దూకుడుకు కళ్లెం వేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. నల్లధనం వెలికి తీయడంలో బీజేపీ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నోటీసులు జారీ చేసింది. ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పని పక్షంలో తమ పరువుకు నష్టం కలిగించినందుకు 5 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై ఐదు రోజుల్లోగా కేజ్రీవాల్ వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News