: 2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ లే పోటీ పడతాయి!: ద్రోణంరాజు


2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా పోటీ పడతాయని కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ బలోపేతమవుతోందని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి పోటీగా నిలుస్తుందని అన్నారు. వైఎస్సార్సీపీ మనుగడ కష్టమన్న ఆయన, తాము మళ్లీ పుంజుకుంటామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఓ సామాజికవర్గం కొమ్ముకాస్తున్నందున ఆయన పార్టీ పోటీ చేస్తుందని ద్రోణంరాజు స్పష్టం చేశారు. నేతల వలసలతో బలం పుంజుకుని బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని ఆయన వివరించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News