: కేంద్రం తెస్తున్న 'రవాణాచట్టం-14' రాష్ట్రాలకు మంచిది కాదు: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి


కేంద్ర ప్రభుత్వం 'రవాణాచట్టం-14'ని తేవడం సరికాదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో 36వ రోడ్డు భద్రతా మండలి భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లపై అధికారం ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే దుర్వినియోగమవుతుందని తెలిపారు. 'రవాణాచట్టం-14' రాష్ట్రాల హక్కులు కాలరాసేదిగా ఈ చట్టం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఏపీ, తెలంగాణ ఆర్టీసీల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News