: విశాఖలో జగన్ పుట్టింటికి, అత్తింటికి కాకుండా పోయాడు: రాజేంద్ర ప్రసాద్
విశాఖపట్టణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ అటు పుట్టింటికి, ఇటు అత్తింటికి కాకుండా పోయారని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రారంభం కంటే ముందు నుంచి విశాఖ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కొణతాల రామకృష్ణను ఇబ్బంది పెట్టేందుకే, టీడీపీకి చెందిన దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. అలాగే, కొణతాల రాజకీయ ప్రతిష్ఠకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టడం వల్లే ఆయన వైఎస్సార్సీపీని వీడి బీజేపీలో చేరే నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కేవలం కొణతాలతోనే వలసలు ఆగవని, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్టీలు మారుతారని ఆయన అభిప్రాయపడ్డారు.