: మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త కారు... ధర కేవలం 69.60 లక్షల రూపాయలే!


విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం పది మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న మెర్సిడెస్ తన లక్ష్యానికి ఒక్క మోడల్ దూరంలో ఉంది. తొమ్మిదో మోడల్ గా పెట్రోలుతో నడిచే 'జీఎల్ఏ 45 ఏఎంజీ'ని మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసింది. భారతదేశంలో ఇప్పటి వరకు 7,529 కార్లను విక్రయించిన బెంజ్ త్వరలోనే పది వేల కార్లను అమ్మేస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది. 'జీఎల్ఏ 45 ఏఎంజీ' ధర కేవలం 69.60 లక్షల రూపాయలు మాత్రమే.

  • Loading...

More Telugu News