: మోదీ నిస్వార్థ సేవకు ఆకర్షితుడనయ్యే బీజేపీలో చేరా: కన్నా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిస్వార్థ సేవకు ఆకర్షితుడనయ్యే భారతీయ జనతా పార్టీలో చేరానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాం మాధవ్ తోపాటు వెళ్లి అమిత్ షాను కలిశానని ఢిల్లీలో కన్నా మీడియాకు తెలిపారు. త్వరలో రాష్ట్ర నేత హరిబాబు సమక్షంలో అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటానని కన్నా వెల్లడించారు. తన సహచరులు ఇంకొందరు కూడా పార్టీలో చేరతారని వివరించారు. కాంగ్రెస్ విధానాలతో కొంత అసంతృప్తిగా ఉన్నమాట నిజమేనని... నమ్మినబంటుగా, నమ్మశక్యమైన నేతగా బీజేపీలో పనిచేస్తానని కన్నా చెప్పారు.